Projects » Guru & Disciple (Telegu) – 2023

The Telegu translation (గురు శిష్యుల బంధం) of Guru & Disciple

గురు శిష్యుల బంధం

Telegu translation - Guru & Disciple

 

మనలో ప్రతి ఒక్కరం పరిపూర్ణ సంబంధాల కోసమై పరితపిస్తున్నాము. అందువల్లనే ఈ భౌతిక ప్రపంచంలోని వ్యక్తులతో, ఇక్కడి ఆస్తిపాస్తులతో లోతైన బంధాల కోసమని పరుగెడుతున్నాము. ఈ లౌకిక బంధాలే మనకు ఆనందాన్ని చేకూర్చగలవని గుడ్డిగా నమ్ముతున్నాము. కానీ గమనించవలసిన విషయం ఏమిటంటే, ఈ బంధాలు తాత్కాలికమైనవి, వాస్తవానికి ఇవి చివరకు బాధలకే దారితీస్తాయి. మరోవైపు నిజమైన సంబంధాలనేవి శాశ్వతంగా నిలిచిపోయేవి, ఆ శాశ్వత బంధాలే మనం ఇంతలా వాంఛిస్తున్న అకుంఠిత ఆనందాన్ని ప్రసాదిస్తాయి. మన గురించి నిజంగా శ్రద్ధ వహించే వారు, మనం వంచన లేని సంబంధాలు కలిగి ఉండి, పూర్తి సంతోషంతో ఉండాలని కోరుకుంటారు. అంతే కాక తాత్కాలిక సంబంధాల నుండి మనం పొందగల మిడిమిడి ‘సంతోషం’ నుండి మనలను కాపాడతారు.

 

మనలను రక్షించు కృష్ణ కృపా మూర్తి
శ్రీల ప్రభుపాదులు ఈ హరేకృష్ణ సంకీర్తనోద్యమం (ఇస్కాన్) యొక్క వ్యవస్థాపక ఆచార్యులు. ఆ ప్రకారంగా, ఈ ఉద్యమంలోని సభ్యులందరికీ వారే ప్రథమ గురువు. మనలో కొంతమంది శ్రీల ప్రభుపాదుల శిష్యులకు సేవ చేయడం ద్వారా శ్రీల ప్రభుపాదులతో సంబంధాన్ని కలిగి ఉండే గొప్ప అవకాశం మన వద్ద ఉంది, వారి శిష్యులకు సేవ చేయడమంటే, శ్రీల ప్రభుపాదులకే స్వయంగా సేవ చేసినట్లు లెక్క, శ్రీల ప్రభుపాదులు నియమించిన వైష్ణవులకు సేవ చేస్తూ, తద్వారా శ్రీల ప్రభుపాదులతో మన సంబంధాన్ని మరింతగా బలపరుచుకోవడానికి ఇదొక సువర్ణ అవకాశం.
ప్రభుపాదుల గురించి మాట్లాడుతూ, ఒకరు బ్రహ్మానంద ప్రభువుని ఇలా అడిగారు, “ఉద్యమపు తొలిరోజుల్లో మీరు ప్రభుపాదులతో గడిపిన రోజులు అత్యంత సన్నిహితమైనవి, తరువాత ఈ ఉద్యమం ప్రపంచ వ్యాప్తమైంది. ఉద్యమం ఉధృతమైన తర్వాత ప్రభుపాదులతో మీకు గల సంబంధంలో ఏదైనా మార్పు వచ్చిందని మీరు భావిస్తున్నారా?”
అప్పుడు బ్రహ్మానంద ప్రభు ఇలా సమాధానమిచ్చారు, “సరే, మీరు చిన్న పిల్లాడిగా ఉన్నప్పటికీ, మరియు ఇప్పుడు మీరు పెరిగి పెద్దవారయ్యాక, మీకు మీ తండ్రి గారికి మధ్య సంభందం ఏమైనా మారిందా‌? ఏమీ మారలేదు కదా. ఇది కూడా అలాగే!”

Book details

1st edition: 
Published: 2023
Publisher: Kadamba Foundation
Author: Kadamba Kanana Swami
ISBN: XXX-XX-XXXXX-XX-X
Pages: , softbound
Weight:  gram
Dimension (HxWxD): A6

Translated by: 
Cover artwork:
Layout & Design: 
Editing: 
Proofreading: